( చిరంజీవి ) ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి !

( చిరంజీవి ) ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి !

ఇది కె సి ఆర్ కొత్త తిట్టు.

ఒళ్ళు దగ్గర పెట్టు కోవాలి అంటే ‘కొడతాను’ లేదా ‘కొట్టిస్తాను’ అని అర్థము.

రాజకీయవాదులు సాధారణం గా బయట ప్రజల మధ్య ఒకలా, ఒంటరి గా ఉన్నపుడు ఒకలా మాట్లాడతారు.

కె సి ఆర్ నాగిరికులు మాట్లాడని విధంగా నోరు పెట్టుకొని ‘తెలంగాన రుస్తుమ్’ అయ్యాడు.

దీనికి టివి ల లో చర్చావేదిక పెట్టి సమయం వ్రుధా చేయడం అనవసరం.

“తెలంగాణా వచ్చుడో – కెసిఆర్ సచ్చుడొ ” అని మొదలు బెట్టిన వుద్యమం,  కొందరు తెలంగాణా నాయకులు ఆకాంక్సతో  ఎగతోసినది, …. ….. ఇప్పుడు చప్పగా చల్లారింది

సీమాంధ్రప్రదేశ్ నాయకుల మాదిరి గా అందరు రాజీనామాలు చేస్తే ప్రత్యెక రాస్ట్రం వస్తాదని అమాయకులైన కొందరు తెలంగాణాప్రదేస్ నాయకులు రాజీనామాలు చేసారు. – కాని కెసిఅర్ విజయశాంతి చేయలేదు.

శ్రీ క్రిష్ణ కమిశను పూర్తిగా అనవసరం అనిచెప్పిన కెసిఆర్,  దాని ముందు వినితిపత్రం ఇచ్చి వచ్చాడు.

కెసిఆర్ అంటె మరో తెలంగాణా సీతయ్య- తను చెప్పింది తనే చెయ్యడు. కమిట్ అయిపోయాడు కాని వాడి మాట వాడే వినడు.

మే 6, 2010 at 3:28 ఉద. వ్యాఖ్యానించండి

Sri Sri 3 more poems siri siri muvvalu

  • వ్యాకరణం తోకుచ్చుకు
  • ·కాకవులు లూరేగుతారు కానీ సుకవుల్
  • ·వ్యాకృతి ఆకృతి మార్చే
  • ·సే కావ్యాలల్లగలరు సిరి సిరి మువ్వా!
  • ·
  • కప్పలను తెచ్చి ఒక రా
  • ·చ్చిప్పం బడవైచి కండ చీమలతో కా
  • ·రప్పిండి జల్లి తింటే
  • ·చిప్పిల్లునే కవనధార? సిరి సిరి మువ్వా!
  • ఆనాడూ ఈనాడూ
  • ·హాస్యానికి విలువ కద్దు
  • ·సాహిత్యసభాంగణాన
  • ·వ్యంగ్యానిది మొదటి పద్దు

మే 3, 2010 at 12:36 సా. వ్యాఖ్యానించండి

Sri Sri sirisiri muvvalu

శ్రీ శ్రీ  శత జయంతి సందంర్భముగా నివాళి;

వారి రచన – ‘మరో  మూడు యాభైలు’   నుండి :-

ప్రచురణ = ఎమెస్కో-1974

  • గొర్రెల మందగ, వేలం
  • వెర్రిగ ఉద్రిక్త భావ వివసులయి జనుల్
  • కిర్రెక్కి పోయినప్పుడు
  • చిర్రెత్తుక వచ్చు నాకు సిరి సిరి మువ్వా!
  • ఉగ్గేల త్రాగుబోతుకు?
  • ముగ్గేలా తాజమహలు మునివాకిటిలో?
  • విగ్గేల క్రిస్నశాస్త్రికి?
  • సిగ్గేల భావకవికి? సిరి సిరి మువ్వా!
  • “ర”మ్మని ఆహ్వానిస్తె
  • పొమ్మనడమం పాడి కాదు పూవిల్తుని రా
  • జ్యమ్మునకున, మధుశాలకు-
  • చెమ్మ సుమీ రెండు చోట్ల సిరి సిరి మువ్వా!
  • పెదబాల శిక్ష చదివీ
  • చదవదమే తదవుగాగ సాహిత్య విశా
  • రదు లయినట్లుగ భావిం
  • చెదరుగదా కొంతమంది సిరి సిరి మువ్వా!
  • రామాయణాలనే మ
  • ళ్ళీ మళ్ళీ దెచ్చి మ్రుచ్చిలించే కన్నా
  • ఆ మోస్తరు రచనల్లో

క్షేమం గద రామకోటి సిరి సిరి మువ్వా!

మే 1, 2010 at 2:45 ఉద. వ్యాఖ్యానించండి

Sri Sri gaari siri siri muvvalu

శ్రీ శ్రీ శత జయంతి సందంర్భముగా నివాళి; వారి రచన – ‘మరో మూడు యాభైలు’ నుండి :- ప్రచురణ = ఎమెస్కో-1974

• గొర్రెల మందగ, వేలం వెర్రిగ ఉద్రిక్త భావ వివసులయి జనుల్ కిర్రెక్కి పోయినప్పుడు చిర్రెత్తుక వచ్చు నాకు సిరి సిరి మువ్వా!

• ఉగ్గేల త్రాగుబోతుకు? ముగ్గేలా తాజమహలు మునివాకిటిలో? విగ్గేల క్రిస్నశాస్త్రికి? సిగ్గేల భావకవికి? సిరి సిరి మువ్వా!

• “ర”మ్మని ఆహ్వానిస్తె పొమ్మనడమం పాడి కాదు పూవిల్తుని రా జ్యమ్మునకున, మధుశాలకు- చెమ్మ సుమీ రెండు చోట్ల సిరి సిరి మువ్వా!

• పెదబాల శిక్ష చదివీ చదవదమే తదవుగాగ సాహిత్య విశా రదు లయినట్లుగ భావిం చెదరుగదా కొంతమంది సిరి సిరి మువ్వా!

• రామాయణాలనే మ ళ్ళీ మళ్ళీ దెచ్చి మ్రుచ్చిలించే కన్నా ఆ మోస్తరు రచనల్లో
క్షేమం గద రామకోటి సిరి సిరి మువ్వా!

మే 1, 2010 at 2:41 ఉద. వ్యాఖ్యానించండి

తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షlu

ఆంధ్రప్రదేస్ లోని యావన్మంది తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు

మార్చి 16, 2010 at 3:14 ఉద. వ్యాఖ్యానించండి

యెదురు దాడి !

యెదురు దాడి
వెర్రితలలు వేస్తున్న వుద్యమము పరకాస్ట … నిన్న లాయర్లు చంద్రబాబు నాయుడు సభలో అతనిని అడ్డుకొని తెలంగాన గురించి చెప్పమని దొమ్మీ చేసి వత్తిడి చేయడం.
పర్యవసానముగా టిడిపి కార్యకర్థలు లాయర్లు మీద చేయి చేసుకున్నారు.   ..  ఈ  కొట్లాటలొ లాయర్లు కొందరికి  దెబ్బలు తగిలాయి.
గీత లొ క్రిష్నుడు చెప్పినట్లుగా కర్మ నీవు చేయి- ఫలితం నాకు వదిలి వేయి, అన్నట్లు దీనికి భాధ్యత, ఫలితము,  అనుభవించేది కె. సి. అర్. అతని కుటుంబం మాత్రమె.

మార్చి 7, 2010 at 3:35 ఉద. 2 వ్యాఖ్యలు

యెద్దుల బండి పై నాయకులు!

యెద్దుల బండి పై నాయకులు!
పెరిగిన పెట్రో ధరలకు వ్యతిరేకముగా నాయకులు యెడ్లబండిని యెక్కారు.
యెడ్లబండిని వాడే వారికి Z కేటగరీ సెక్యుఊరిటి Yఎందుకు.
వారి వెనుక పదుల సంఖ్యలో సెక్యురిటి  వారు రోడ్డు మీద పరుగుల పెడుథు యెటువంటి కాపలా ఇవ్వగలరు ?

మార్చి 3, 2010 at 2:25 ఉద. వ్యాఖ్యానించండి

న్యాయవాదులా – రాజకీయ కార్యకర్తలా ?

న్యాయవాదులా  -రాజకీయ కార్యకర్తలా ?

ప్రస్తుత తెలంగాణ వుద్యమం వూపు లో  తెలంగాన ప్రాంతం రాజకీయ నాయకులె కాకుండా, సమాజంలోని అన్ని వర్గాలు, గృహిణులు, పురుషులు, స్కూలు పిల్లలు, వుద్యోగులు, ఒస్మానియా మరియు ఇతర విద్యార్థులు జూనియరు డాక్టర్లు, అందరూ చేరారు. కొందరికి ప్రత్యేక జాయిన్టు యేక్సను కమిటీలు వున్నాయి.

ఒస్మానియా విద్యార్థులు, జూనియరు డాక్టర్లు హైకోర్టు నుండి అనుమతి తెచ్చుకొని సభలు నిర్వహణ చేసారు.

తెలంగాణ న్యాయవాదులు  సభలు నిర్వహణ చేహలేదు. కాని కోర్టులు బహిష్కరించాru.  హైకోర్టు ఆవరణలో 50  రోజుల పైబడి రెలే నిరాహారదీక్శలు చేసారు. కెసిఅర్ వారిని వుద్దేసించి అద్వకేటు జనరల్ తెలంగాన ప్రాంతం నుండి రాలెదు, కోర్టులలొ ఇతర వుద్యోగాలు తెలంగానవారిని నియమించలేదు వారికి అన్యాయం జరుగుతుంది అని వారిని రెచ్చగొట్టారు. కోర్టు న్యాయవాదులు కూడా కోదండరాం వేసిన  వుద్యమం రూటుమాపు ప్రకారం రోడ్లమీద వంటావార్పులు, భోజనాలు చేయడం, ట్రాఫిక్ అంతరాయం చేసి ధర్నాలు చేయడం చేసారు

తెలంగాణ న్యాయవాదుల చెస్తున్న వుద్యమము తగినట్టుగా లేదు.  వారి వ్రుత్తి గౌరవానికి భంగకరం గా ప్రవర్తించారు

సుమారు 2000 వేలమంది న్యాయవాదులు డిల్లీ పార్లమెంటు భవనం ముందు ధర్నా చేసి హైదరాబాదు తిరిగి వచ్చిన వారికి సహజంగా  పూలదండలతో స్వాగతం చెప్పి టి ఆర్ ఎస్ మాజీ ఎమ్. ఎల్. ఏ. హరీశరావు వారిని  పొగిడాడు.   చెడ్డపనిని ప్రోత్సహించడం అంటె ఇదె.

అయితే ఈ న్యాయవాదులు  చేసింది  చాలా చెడ్డ precedent చేసారు. సందేహం లేదు.  న్యాయవాదులు కోర్టులో వ్రుత్తి ధర్మం ప్రకారం పనిచేస్తున్నపుడు నల్లకోటు, తెల్ల పట్టీలు (white Bands) ధరించాలి. కాని పబ్లిక్ ప్లేసులలో సాధారణంగా ప్రచారం నిమిత్తం ధరించకూడదు. నల్లకోటుకు అవమానం కల్గేలా ధర్నాలలో పాల్గొని పోలీసులతొ లాటి దెబ్బలు, water cannon దెబ్బలు తినడానికి వుపయోగిస్తే డిల్లీలో వారికి జరిగిన అవమానం న్యాయవాద వ్రుత్తిలో వారందరికి జరిగిన అవమానం.   కె సి అర్ చెప్పినట్ట్లు అది తెలంగాణవారికి జరిగిన అవమానం కాదు.

.

ముఖ్యంగా న్యాయవాదులు రాజకీయకార్యకర్తలతో కలసి రాజీనామాలు చేయని తెలంగానా ప్రాంతం శాసన సభ్యుల ఇళ్ళముందు ధర్నాలు చేయడం, బలవంతముగా రాజీనామాలు చేయించడము, చట్టవ్యతిరెఖ చర్యలకు, దౌర్జన్యానికి వత్తాసు పలికే ప్రకటనలు టివిలలో చేయడo    advocates చేయకూడని పనులు.

ఇతరుల హక్కుల గురించి, స్వేచ్చ గురించి, ఆస్తుల పరిరక్శణ గురించి వాదించి కాపాడవలసిన న్యాయవాదులే ధర్నాలు చేస్తే, అది విచారించవలసిన విసయం. అప్పుదు వారికి రాజకీయ కార్యకర్తలకు తేడా లేదు. పోలీసులు ఆ పరిస్తితిలో కోటు వేసుకున్నవానిని లేనివారిని ఒకే మాదిరిగా దండాయుధం ప్రయోగిస్తారు.

ఫిబ్రవరి 25, 2010 at 2:18 సా. 2 వ్యాఖ్యలు

విద్యార్థులకు రాజకీయాలు అవసరమా – అవసరమే

విద్యార్థులకు రాజకీయాలు అవసరమా – అవసరమే.

విద్యార్థులకు రాజకీయాలు అవసరమే.

యె నాయకుడు యెమిటి చెపుతున్నాడు, యె పరిస్తిథిలో చెపుథున్నాడు, యెందుకు చెపుతున్నాడు, అథని స్వప్రయోజనము వున్నాదా అని ఆలోచించి నిర్నయాలు తీసుకునే తెలివి అతనికి వుండాలి.

ఎ  సమస్యనైన అన్ని కోనాలతొ చూసి నిర్నయించాలి. వుద్వేగ పూరితముగా వూహించి నాయకులు పిలుపులు ఇస్తే పొలోమని వెళ్ళి ఇతరలు ఇళ్ళపై రాళ్ళు రువ్వడము ఇతరుల స్వెచ్చను హరించడము , పోలిసులపై రాళ్ళు రువ్వడము తరువాత వాళ్ళు లాటిచర్జీ చెసారని గగ్గోలు పెట్టడము ఎందుకు.

స్వంత వివేచన వదిలిన విద్యార్థులు ఇతరులకు పనిముట్టుగ మాత్రమే వుపయో గపడతారు.

ఫిబ్రవరి 16, 2010 at 3:26 ఉద. 2 వ్యాఖ్యలు

ఉద్యమాలలో విద్యార్థులు

ఉద్యమాలలో విద్యార్థులు

విద్యార్థులు లేనిదే ఏ ప్రజావుద్యమం కొనసాగలేదు.

ఇది రాజకీయనాయకులకందరకు తెల్సినదె.

తెలంగానా వుద్యమసౌధానికి రాళ్ళెత్తిన కూలీలు- వుస్మానియా విద్యార్థులు.

కెసిఆర్ నారింజరసం త్రాగి ఖమ్మం ఆసుపత్రిలొ దీక్సను విరమించే దసలో

విద్యార్థులు అతని దిస్టిబొమ్మలు తగలబెట్టి తీవ్రంగా తమ నిరసన తెల్పి కెసిఆర్  ఆసుపత్రిలొ కొనసాగేలా చేసారు.

వాళ్ళు చేసే త్యాగాలు రాజకీయనాయకులు అదికారం పొందడానికి, పదవులకు పునాదిరాళ్ళు అవుతున్నాయి. కొందరు అమాయకులు ( స్రీకాంత, వేణుగోపాలరెడ్డి)  ప్రాణాలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు.

తెలంగాణ విద్యార్థులు వుస్మానియా ప్రాంగణంలో బ్రహ్మాండమయిన సభ చేసారు. వారి సత్తా చూపెట్టారు. వుద్యమం కొద్దికాలం అయితే పిక్నిక్ మాదిరిగా హుసారుగాపాల్గొంటారు.

వుద్యమం హెచ్చుకాలం కొనసాగితే విద్యార్థులు క్లాసులు పోగొట్టుకుంటారు. శెడ్యూలు ప్రకారం

ఎంట్రన్సు పరీక్షలు జరగవు. బాగాతెలివైన విద్యార్థులు తమ రేంకులు పోగొట్టుకుంటారు.

తరువాత మొక్కుబడిగా పెట్టే పరీక్షలలో వెనకబడిన విద్యార్థులకు డిగ్రీలు, మంచి రేంకులు వస్తాయి. విద్యార్థులు భవిష్యత్త్లులు, రేంకులు తారుమారు అవుతాయి. జై ఆంధ్ర వుద్యమం తరువాత అలాగే జరిగింది. విద్యార్థులు పాసు అయిన తరువాత కూడ  పైచదువులకు, వుద్యోగాలలొ, వుద్యమాల ప్రాంతంలో, ఆసంవత్స్రరం బేచి విద్యార్థులని బ్ల్లాక్ లిస్ట్ లొ పెడితే వారి అవకాసాలు తగ్గిపోతాయి.

ప్రాణాలు తీసుకున్నవారేకాదు, అందరూ విద్యాసంవత్సరాన్ని త్యాగం చేసినట్టే.

ఫిబ్రవరి 15, 2010 at 3:09 సా. వ్యాఖ్యానించండి

Older Posts


వర్గాలు

  • Blogroll

  • telugu

  • telugu posts

  • Feeds