ఉద్యమాలలో విద్యార్థులు
ఫిబ్రవరి 15, 2010 at 3:09 అపరాహ్నం మీ ఉద్దేశ్యం…
ఉద్యమాలలో విద్యార్థులు
విద్యార్థులు లేనిదే ఏ ప్రజావుద్యమం కొనసాగలేదు.
ఇది రాజకీయనాయకులకందరకు తెల్సినదె.
తెలంగానా వుద్యమసౌధానికి రాళ్ళెత్తిన కూలీలు- వుస్మానియా విద్యార్థులు.
కెసిఆర్ నారింజరసం త్రాగి ఖమ్మం ఆసుపత్రిలొ దీక్సను విరమించే దసలో
విద్యార్థులు అతని దిస్టిబొమ్మలు తగలబెట్టి తీవ్రంగా తమ నిరసన తెల్పి కెసిఆర్ ఆసుపత్రిలొ కొనసాగేలా చేసారు.
వాళ్ళు చేసే త్యాగాలు రాజకీయనాయకులు అదికారం పొందడానికి, పదవులకు పునాదిరాళ్ళు అవుతున్నాయి. కొందరు అమాయకులు ( స్రీకాంత, వేణుగోపాలరెడ్డి) ప్రాణాలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు.
తెలంగాణ విద్యార్థులు వుస్మానియా ప్రాంగణంలో బ్రహ్మాండమయిన సభ చేసారు. వారి సత్తా చూపెట్టారు. వుద్యమం కొద్దికాలం అయితే పిక్నిక్ మాదిరిగా హుసారుగాపాల్గొంటారు.
వుద్యమం హెచ్చుకాలం కొనసాగితే విద్యార్థులు క్లాసులు పోగొట్టుకుంటారు. శెడ్యూలు ప్రకారం
ఎంట్రన్సు పరీక్షలు జరగవు. బాగాతెలివైన విద్యార్థులు తమ రేంకులు పోగొట్టుకుంటారు.
తరువాత మొక్కుబడిగా పెట్టే పరీక్షలలో వెనకబడిన విద్యార్థులకు డిగ్రీలు, మంచి రేంకులు వస్తాయి. విద్యార్థులు భవిష్యత్త్లులు, రేంకులు తారుమారు అవుతాయి. జై ఆంధ్ర వుద్యమం తరువాత అలాగే జరిగింది. విద్యార్థులు పాసు అయిన తరువాత కూడ పైచదువులకు, వుద్యోగాలలొ, వుద్యమాల ప్రాంతంలో, ఆసంవత్స్రరం బేచి విద్యార్థులని బ్ల్లాక్ లిస్ట్ లొ పెడితే వారి అవకాసాలు తగ్గిపోతాయి.
ప్రాణాలు తీసుకున్నవారేకాదు, అందరూ విద్యాసంవత్సరాన్ని త్యాగం చేసినట్టే.
Entry filed under: telengaana, telugu, telugu posts. Tags: students, telengana problem, Teluuposts.
Trackback this post | Subscribe to the comments via RSS Feed