న్యాయవాదులా – రాజకీయ కార్యకర్తలా ?
ఫిబ్రవరి 25, 2010 at 2:18 అపరాహ్నం 2 వ్యాఖ్యలు
న్యాయవాదులా -రాజకీయ కార్యకర్తలా ?
ప్రస్తుత తెలంగాణ వుద్యమం వూపు లో తెలంగాన ప్రాంతం రాజకీయ నాయకులె కాకుండా, సమాజంలోని అన్ని వర్గాలు, గృహిణులు, పురుషులు, స్కూలు పిల్లలు, వుద్యోగులు, ఒస్మానియా మరియు ఇతర విద్యార్థులు జూనియరు డాక్టర్లు, అందరూ చేరారు. కొందరికి ప్రత్యేక జాయిన్టు యేక్సను కమిటీలు వున్నాయి.
ఒస్మానియా విద్యార్థులు, జూనియరు డాక్టర్లు హైకోర్టు నుండి అనుమతి తెచ్చుకొని సభలు నిర్వహణ చేసారు.
తెలంగాణ న్యాయవాదులు సభలు నిర్వహణ చేహలేదు. కాని కోర్టులు బహిష్కరించాru. హైకోర్టు ఆవరణలో 50 రోజుల పైబడి రెలే నిరాహారదీక్శలు చేసారు. కెసిఅర్ వారిని వుద్దేసించి అద్వకేటు జనరల్ తెలంగాన ప్రాంతం నుండి రాలెదు, కోర్టులలొ ఇతర వుద్యోగాలు తెలంగానవారిని నియమించలేదు వారికి అన్యాయం జరుగుతుంది అని వారిని రెచ్చగొట్టారు. కోర్టు న్యాయవాదులు కూడా కోదండరాం వేసిన వుద్యమం రూటుమాపు ప్రకారం రోడ్లమీద వంటావార్పులు, భోజనాలు చేయడం, ట్రాఫిక్ అంతరాయం చేసి ధర్నాలు చేయడం చేసారు
తెలంగాణ న్యాయవాదుల చెస్తున్న వుద్యమము తగినట్టుగా లేదు. వారి వ్రుత్తి గౌరవానికి భంగకరం గా ప్రవర్తించారు
సుమారు 2000 వేలమంది న్యాయవాదులు డిల్లీ పార్లమెంటు భవనం ముందు ధర్నా చేసి హైదరాబాదు తిరిగి వచ్చిన వారికి సహజంగా పూలదండలతో స్వాగతం చెప్పి టి ఆర్ ఎస్ మాజీ ఎమ్. ఎల్. ఏ. హరీశరావు వారిని పొగిడాడు. చెడ్డపనిని ప్రోత్సహించడం అంటె ఇదె.
అయితే ఈ న్యాయవాదులు చేసింది చాలా చెడ్డ precedent చేసారు. సందేహం లేదు. న్యాయవాదులు కోర్టులో వ్రుత్తి ధర్మం ప్రకారం పనిచేస్తున్నపుడు నల్లకోటు, తెల్ల పట్టీలు (white Bands) ధరించాలి. కాని పబ్లిక్ ప్లేసులలో సాధారణంగా ప్రచారం నిమిత్తం ధరించకూడదు. నల్లకోటుకు అవమానం కల్గేలా ధర్నాలలో పాల్గొని పోలీసులతొ లాటి దెబ్బలు, water cannon దెబ్బలు తినడానికి వుపయోగిస్తే డిల్లీలో వారికి జరిగిన అవమానం న్యాయవాద వ్రుత్తిలో వారందరికి జరిగిన అవమానం. కె సి అర్ చెప్పినట్ట్లు అది తెలంగాణవారికి జరిగిన అవమానం కాదు.
.
ముఖ్యంగా న్యాయవాదులు రాజకీయకార్యకర్తలతో కలసి రాజీనామాలు చేయని తెలంగానా ప్రాంతం శాసన సభ్యుల ఇళ్ళముందు ధర్నాలు చేయడం, బలవంతముగా రాజీనామాలు చేయించడము, చట్టవ్యతిరెఖ చర్యలకు, దౌర్జన్యానికి వత్తాసు పలికే ప్రకటనలు టివిలలో చేయడo advocates చేయకూడని పనులు.
ఇతరుల హక్కుల గురించి, స్వేచ్చ గురించి, ఆస్తుల పరిరక్శణ గురించి వాదించి కాపాడవలసిన న్యాయవాదులే ధర్నాలు చేస్తే, అది విచారించవలసిన విసయం. అప్పుదు వారికి రాజకీయ కార్యకర్తలకు తేడా లేదు. పోలీసులు ఆ పరిస్తితిలో కోటు వేసుకున్నవానిని లేనివారిని ఒకే మాదిరిగా దండాయుధం ప్రయోగిస్తారు.
Entry filed under: telengaana, telugu posts. Tags: telengana problem, teluguposts.
అభిప్రాయములు Add your own
ప్రత్యుత్తరమిమ్ము
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
mohan ram prasad | 1:15 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 26, 2010
your opinion is correct.
2.
chitralekha45 | 2:49 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 26, 2010
sri mohan, thanks for your comment.