• తెలంగాణ ఒస్మానియా విద్యార్థులు చేస్తున్న ఉద్యమము -తీవ్రత వారి నిబద్దత , వారి త్యాగము సందేహము లేదు అవి సాటి లేనివి .
  • విద్యార్థులకు ప్రత్యేకముగా పొందేది ఏమిటి ? హెచ్చు ఉద్యోగ అవకాసలా ?
  • వారు పొందేది దాని కంటే కోల్పోయేది హెచ్చు .ఆంద్ర ప్రాంతం వారైనా తెలేన్గాన వారైనా వారు మెరిట్ తోనే ఉద్యోగాలు తెచ్చుకోవాలి
  • ఏ రాజకీయ నాయకుడైన రాష్ట్రాన్ని విభజించే ముందు ఆత్మా గౌరవ నినాదాన్ని ప్రచారం చేస్తారు . ప్రత్యెక రాష్ట్రం వస్తే లాభించేది రాజకీయ పదవులు ఆశించే వారికి , రియల్ ఎస్తాటు వారికీ.
  • ఈ పోటి ప్రపంచములో క్లాసులు మానివేసి కాలేజిలు మూసుకుంటే విద్యార్థులు నష్ట పోతారు

జనవరి 2, 2010 at 11:38 ఉద. వ్యాఖ్యానించండి

political dictionary continued

ఆంద్ర = పూర్వము దీని అర్థము తెలుగు భాష మరియు తెలుగు వారు ఉదా; ఆంద్ర మహా భారతము
ఇప్పటి అర్థము = కోస్తా ప్రాంతం, సర్కారు జిల్లాలు

జనవరి 2, 2010 at 10:38 ఉద. వ్యాఖ్యానించండి

new political dictionary of AP continued..

కే సి ఆర్  = కే చంద్రశేఖరుడు, తెలంగాణ గాంధి , తెలంగాణ కు  కొత్త నిజాము , తెలంగాణ కు ప్రస్తుతము  దశ దిశా

సిద్ధాంతకర్త = ఒక రాద్ధాంతకర్త కు తోడూ నీడ

హరిష రావు = రాజు గారి బావమరది

దామోదర రెడ్డి = ఉద్యమము లో వెనక వచ్చిన కొమ్ములు

జనవరి 2, 2010 at 9:38 ఉద. వ్యాఖ్యానించండి

mana rajadhani/our capital city

చంద్రశేఖరుడు చేసిన చండి యాగము ఇతర పూజలు ఫ్హలించాయి రేపు రాబోయే తెలంగాణా కు ముఖ్యమంత్రి ఆయెనే . నెహురు కుటుంబం లా ఆయన వంశానికి రాజకీయ అధికారం వస్తుంది ఆయన కుమార్తె హైదరాబాదులో వున్నా చిత్ర పరిశ్రమలోని వ్యక్తులు ఎలా నడుచుకోవాలో టీవీ లో చెప్పారు . మేనల్లుడు హరిశారావు సరే సరి. హైదరాబాద్కు దశ దిశా ప్రస్తుతం అతనే.
జానారెడ్డి గారు జే ఎ సి చేరుతూ ఉద్యమానికి నాయుకుడు తెలంగాణ భూమి అన్నారు ఎ వ్యక్తీ కారు అన్నారు కాని మీడియా కు తెలుసుని
ఇప్పుడు కే సి ఆర్ ప్రతి మాట ఒక వార్త ; ప్రతి వ్యాఖ్య కొత్త నిజాము గారి ఫర్మానా.
సి ఎం కూడా నేను సేట్టిలర్న- కాదా అని లెక్కలు వేసుకుంటున్నారు .

జనవరి 2, 2010 at 4:04 ఉద. వ్యాఖ్యానించండి

neelam sanjeevareddy speech for visaalandhra

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఆవిర్భావానికి నాందిగా, ‘విశాలాంధ్ర ఏర్పాటు’ తీర్మానాన్ని 1956 ఫిబ్రవరి 1వ తేదీన కర్నూలు కేంద్రంగా ఉన్న ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. అప్పటి ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెడుతూ 1956 ఫిబ్రవరి 1న   ప్రసంగ భాగం printed in Surya daily e-paper, link  ; http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=7&ContentId=28850

“ఏ ప్రాంతంలో ఎంత దూరంలో ఉన్నా ఆంధ్రులు అంతా ఒక్కటే. మనం అంతా కలిసి ఉంటే కష్ట సుఖాలు సమానంగా పంచుకుంటాం. “తెలంగాణ వెనుక ఉంటే సంతోషించము. ముందుకు తీసుకపోయి సౌష్టవంగా బాగుపరచుకోవడానికి వీలు పడువుతుంది.

డిసెంబర్ 31, 2009 at 3:02 సా. వ్యాఖ్యానించండి

kaloji poem on telengana accent and boyi bheemana kavi

తెలంగాణ ‘యాస’ నెపుడు యీసడించు

తెలంగాణ ‘యాస’ నెపుడు
యీసడించు భాషీయుల
‘సుహృద్భావన’ ఎంతని
వర్ణించుట సిగ్గుచేటు

వాక్యంలో మూడుపాళ్ళు
ఇంగ్లీషు వాడుకుంటు
తెలంగాణీయుల మాటలో
ఉర్దూపదం దొర్లగానే
హిహీ అని ఇగిలించెడి
సమగ్రాంధ్ర వాదులను
ఏమనవలెనో తోచదు.

‘రోడ్డని’ పలికేవారికి
సడకంటె ఎవగింపు
ఆఫీసని అఘొరిస్తూ
కచ్చేరంటే కటువు
సీరియలంటే తెలుగు
సిల్సిల అంటే ఉరుదు

సాల్టు, షుగర్, టిఫిన్ తెనుగు
షర్కర్, నాష్తంట్ కొంప మునుగు
టీ అంటే తేట తెనుగు
చా అంటే ‘తౌరక్యము’
పొయినడంటే చావు
తోలడమంటే పశువు

దొబ్బడమంటే బూతు
కడప అంటే ఊరి పేరు
త్రోవంటె తప్పు తప్పు
దోవంటేనే దారి.

బొక్కంటే ఎముక కాదు
బొక్కంటె పొక్క తెలివి
మందలిస్తె తిట్టినట్లు
చీవాట్లు పెట్టినట్లు
పరామర్శ కానేకాదు

బర్రంటె నవ్వులాట
గేదంటేనే పాలు
పెండంటె కొంప మునుగు
పేడంటేనే ఎరువు

రెండున్నర జిల్లాలదె
దండి భాష తెలుగు
తక్కినోళ్ల నోళ్ల యాస
త్రొక్కి నొక్కి పెట్టు తీర్పు

వహ్వారే! సమగ్రాంధ్ర
వాదుల ఔదార్యమ్ము
ఎంత చెప్పినా తీరదు
స్నేహము సౌహర్ద్రమ్ము

భోయి భీమన్న ఒకడు
తెనుగును రక్షించువాడు
భోయి భీమన్న ఒకడు
బెజవాడ గోపాలుని
సభ్యత నెర్గిన ఆంధ్రుడు

భోయీ భీమన్న ఒకడు
పదారణాల ఆంధ్రుడు
తెనుగు సభ్యత సంస్కృతి
ఆపాద మస్తకంబు
నోరు విప్పితే చాలు
తెనుగు తనము గుబాళించు

కట్టుబొట్టు మాట మంతి
నడక ఉనికి ఒకటేమిటి
ఎగుడు దిగుడు ఊపిరిలో
కొట్టొచ్చే తెనుగు తనము
గోపాల కీర్తనమే జీవిక
పాపము అతనికి

ఉర్డంటే మండి పడెడి
పాటి తెనుగు ఆవేశము
జౌనపదుని లేఖ లేవో
జౌఇన రహిత ప్రాయంబున
వ్రాసినాడు అంతెకాని
తెలివిన పడి, వృద్ధదశలో
కాస్మా పాలిటన్ తనము
శిఖరోహణ అనుకొని
పరిణతి దశ నందు కొనగ
తాపత్రయ పడుచున్నడు

భోయి భీమన్న ఒకడు
తెనుగును రక్షించువాడు
సమైక్యాంధ్రవాది వాడు
భీమశాస్ర్తి అని నాతో
పిలుపించు కొన్నవాడు
జానపదుని లేఖావళి
నాటి సఖుడు భీమన్న
-కాళోజి
…………

డిసెంబర్ 25, 2009 at 3:09 ఉద. 1 వ్యాఖ్య

new political dictionary

కొత్త తెలుగు రాజకీయ నిఘంటువు

  • సంయమనం పాటించండి = ఫర్వాలేదు రెచ్చిపోండి = లొల్లి చేయండి
  • ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి= మీరు బకరాలు,  మా గురించి ప్రాణ త్యాగం  చేయండి
  • విద్యార్తులుకు చేతులెత్తి మొక్కుతున్నాను = నా మనసు తెలుసుకొని రెచ్చిపోండి
  • మీ గురించి నా ప్రాణాలైన అర్పిస్తా = నాకు నా పదవి ముఖ్యం
  • విద్యార్థులు, మేధావులు న్యాయవాదులు = రాజకీయ బకరాలు
  • సిద్ధాంతకర్త = ఒకటే పుస్తకం ఒకటే వాదన ఒకటే సిద్ధాంతం తెలిసినవాడు, చరిత్ర కు మసిపుయడము తెలిసినవాడు
  • ప్రత్యెక రాష్ట్ర వాది = రాజకీయ నిరుద్యోగి

డిసెంబర్ 24, 2009 at 12:04 సా. 2 వ్యాఖ్యలు

Deeksha Dakshulu

దీక్షా దక్షులు


ఏభై సంవత్రసల పోరాటంతో సాధ్యం  కానిది రాష్ట్ర విభజన ఎలా సాధ్యమయింది ? కే సి ఆర్ తెలేన్గాన  గాంధీ ఎలా అయ్యారు?
చరిత్ర ఎలా  వున్నా కే సి ఆర్ నిరాహార దీక్ష తో కొందరు తెలంగాణ  నాయకులు  కేంద్రాన్ని ఎమోషనల్గా బ్లాకుమైలు చేయడం జరిగింది. ఆయన పరిస్థి నేదో రేపో గ వుందని భావించి విభంజన ప్రక్రియ ప్రారంభించ వలసినిదిద్గా కేంద్రం ప్రకటన చేసింది. మెగిలిన ప్రాంతాలవారి కి సహజముగా మింగుడుపడదు . పొట్టి శ్రీరాములు విగ్రహానికి మసి పూయడం ఆంద్ర పేరు లు చేరిపివేయడం వంటి వాటిని తెలంగాణ విలేఖర్లు జయశంకర్ లాంటి మేధావులు ఖండించిలేదు.కే సి ఆర్ దీక్ష సమయములో ఎకపక్షమైన ప్రసారాలు టి జి వెంకటేష్, లగాతపతి ప్రకటనలతో తెన్దవకోణం చర్చకు వచ్చింది.

డిసెంబర్ 22, 2009 at 4:48 ఉద. వ్యాఖ్యానించండి

electing LegislativeParty leader

After the death of CM Sri YSR, the  A.P. congress legislature party failed to elect it’s leader in a  meeting specially convened for it but passed resolution  leaving  the choice to their party president at national level Smt Sonia Gandhi. In their wisdom they did it;  But their action  appears to be unconstitutional.

నవంబర్ 28, 2009 at 10:16 ఉద. వ్యాఖ్యానించండి

Courageous lady president

25 అక్టోబర్ 2009 మన దెశచరిత్రలో ముఖ్యమైన రోజు. 74 సంవత్సరాలు వయసున్న మన రాస్టృపతి గారు శ్రీమతి ప్రతిభాపాటిల్ సుఖోయ్ -30 యుద్ధ విమానంలో గంటకు 900 కిలొమీటర్లు వేగంతో భూమికి అరగంట సేపు గగనంలో విహరించారు. ఆ వయస్సులో మహిళ ఐనా యుద్ధ విమానంలో విహరించిన మొదటి మహిళ ఆయ్యింది. మనదెశంలో ఏయర్ ఫోర్సు లో మహిళలు ఇంకా యుద్ధ విమానాలు నడిపిన్ ఇవారు లేరు. విదేశాలలో కుడా యుద్ధ విమానాలలో యెక్కిన దేశాధ్యక్షులు అతి తక్కువమంది

నవంబర్ 28, 2009 at 4:59 ఉద. వ్యాఖ్యానించండి

Older Posts Newer Posts


వర్గాలు

  • Blogroll

  • telugu

  • telugu posts

  • Feeds