Sri Sri gaari siri siri muvvalu

మే 1, 2010 at 2:41 ఉద. వ్యాఖ్యానించండి

శ్రీ శ్రీ శత జయంతి సందంర్భముగా నివాళి; వారి రచన – ‘మరో మూడు యాభైలు’ నుండి :- ప్రచురణ = ఎమెస్కో-1974

• గొర్రెల మందగ, వేలం వెర్రిగ ఉద్రిక్త భావ వివసులయి జనుల్ కిర్రెక్కి పోయినప్పుడు చిర్రెత్తుక వచ్చు నాకు సిరి సిరి మువ్వా!

• ఉగ్గేల త్రాగుబోతుకు? ముగ్గేలా తాజమహలు మునివాకిటిలో? విగ్గేల క్రిస్నశాస్త్రికి? సిగ్గేల భావకవికి? సిరి సిరి మువ్వా!

• “ర”మ్మని ఆహ్వానిస్తె పొమ్మనడమం పాడి కాదు పూవిల్తుని రా జ్యమ్మునకున, మధుశాలకు- చెమ్మ సుమీ రెండు చోట్ల సిరి సిరి మువ్వా!

• పెదబాల శిక్ష చదివీ చదవదమే తదవుగాగ సాహిత్య విశా రదు లయినట్లుగ భావిం చెదరుగదా కొంతమంది సిరి సిరి మువ్వా!

• రామాయణాలనే మ ళ్ళీ మళ్ళీ దెచ్చి మ్రుచ్చిలించే కన్నా ఆ మోస్తరు రచనల్లో
క్షేమం గద రామకోటి సిరి సిరి మువ్వా!

Entry filed under: Uncategorized. Tags: .

తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షlu Sri Sri sirisiri muvvalu

వ్యాఖ్యానించండి

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


క్యాలెండరు

మే 2010
సో మం బు గు శు
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Most Recent Posts